ట్రంపు కి కొంచెం తిక్కుంది – కానీ దానికో లెక్కుంది

243
Trump's last-minute pardons

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్,  తనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ క్రియేట్  చేసుకొని ఏది చేసిన కూడా సరికొత్తగా, మొండిగా నచ్చినట్లు చేస్తాడన్న విషయం తెలిసిందే, ట్రంప్ పద‌వీకాలం నేటితో ముగియ‌నున్న‌ది. నాలుగు సంవత్సరాల పదవి కాలంలో తన పాలన ఎలా ఉందొ తెలిసిన విషయమే, ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసాడు, నేటితో తన పదవి కాలం ముగిసిన నేపథ్యంలో,  ఒకేసారి 73 మందికి ఆయ‌న క్ష‌మాభిక్ష పెట్టడం విశేషం.

డోనాల్డ్ ట్రంప్ వ‌ద్ద ప‌నిచేసిన మాజీ అడ్వైజ‌ర్ స్టీవ్ బాన‌న్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇంకాకొన్ని గంట‌ల్లో 46వ అమెరికా  దేశాధ్య‌క్షుడిగా, జోసెఫ్ బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి ముందే ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకోని తన ఔదార్యాన్ని చాటాడు . ట్రంప్ పాలన ‌చివరి రోజుల్లో, దాదాపుగా  140 మందికి క్ష‌మాభిక్ష పెట్టారు. ర్యాప‌ర్ లిల్ వెయినీ, కిల్‌ప్యాట్రిక్‌, డెట్రాయిట్ మేయ‌ర్ క్వామీ, బ్లాక్కోడాక్ లు,  కూడా ప్రాణ‌భిక్ష పొందిన‌వారిలో ఉన్నారు. 73 మందికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించిన అంశాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది . 73 మందికి క్షమాబిక్ష ప్రసాదించడమే కాకుండా, మరో  70 మందికి,ట్రంప్ శిక్ష‌ను త‌గ్గించిన‌ట్లు వైట్‌హౌజ్ పేర్కొన్న‌ది.

2016 ఎలక్షన్ల సమయంలో  స్టీవ్ బ్యాన‌న్‌.. ట్రంప్ వ్యూహాక‌ర్త‌గా పనిచేసారు. అయితే చివరి సంవత్సరం , ఆగ‌స్టులో ఆయ‌న్ను అరెస్టు చేశారు. మెక్సికో స‌రిహ‌ద్దు గోడ నిర్మాణం కోసం జ‌రిగిన ఫండ్స్ సేక‌ర‌ణ‌లో స్టీవ్ బాన‌న్ అక్ర‌మాలు చేసినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వంద‌ల సంఖ్య‌లో ఫండ్స్ ఇచ్చేవారిని త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు బాన‌న్‌పై కేసు న‌మోదు అయ్యింది.  వీ బిల్డ్ ద వాల్ క్యాంపేన్ ద్వారా సుమారు 25 మిలియ‌న్ల డాల‌ర్లు సేకించారు.  దాంట్లో దాదాపుగా  పది లక్షల డాలర్లు‌, బాన‌న్ అక్రమానికి ‌పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ర్యాప‌ర్ వెయిన్‌, కొడాక్‌పై ఆయుధాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  వైట్‌హౌజ్‌ను వీడి వెళ్తున్న అధ్య‌క్షులు. క్ష‌మాభిక్ష‌ను పెట్టడం  ‌సాధ‌ర‌ణ‌మే అయినప్పటికీ ,డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇ నిర్ణయానికి సోషల్ మీడియల్లో విశేషస్పందన రావడం గమన్హారం