45 వ డివిజన్ లో ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు

178
LED Lights in 45th Division

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లోని స్థానిక 45 వ డివిజన్ తిలకనగర్, ద్వారాకనగర్ డౌన్, చంద్రశేఖర్ నగర్ లలో కార్పొరేటర్ కొమ్ము వేణు డివిజన్ ప్రజల సమస్యలను గుర్తించి అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాలు మరియు నూతన ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే దానికి సంబందించిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.

అలాగే 45 వ డివిజన్ ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదర్శవంతమైన డివిజన్ గా చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు ,మోత్కూల రమేష్,వేట అశోక్ రెడ్డి, మీనుగు సురేష్, ఎర్రగోళ్ల శ్రీకాంత్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.