ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్

246
Morning walk is for solving public problems

ప్రజా సమస్యల పరిష్కారమే మార్నింగ్ వాక్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఉదయం రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 20వ డివిజన్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ డివిజన్లో పాదయాత్ర చేస్తు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తర్వాత ఆయన మాట్లాడుతూ… రామగుండం ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత మెదటి విడత మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రామగుండంలో అస్థవ్యస్తంగా ఉన్న రోడ్డు, కాలువలు, సర్వీస్ రోడ్ల పనులన్ని పూర్తి దశకు చేరుకున్నాయన్నారు.

రామగుండం ప్రాంతానికి సకల సౌకర్యాలు కల్పించి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. 20వ డివిజన్ ప్రజల, ప్రజప్రతినిధుల అభిష్టం మేరకు డంప్ యాడ్ స్థలంలో ఈ.ఎస్.ఐ ఆసుపత్రిని ఏర్పాటు త్వరలో చేస్తామన్నారు.

ఎస్టీ, బిసి కాలనీ ప్రజల తమకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరడం జరిగిందని, వారి కోసం కమ్యూనిటి భవనం నిర్మాణం చేస్తామన్నారు. ఎంపిడిఓ కార్యాలయం ఎదుట 10లక్షలతో యు.జి.డి నిర్మాణం చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 100 కోట్లు మంజారు చేస్తుందన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దాలన్నా లక్ష్యంతో పాలన సాగిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు..