
ఎంతో ఘనంగా పెళ్లి జరిగిన ఇంట్లో విషాదఛాయలు అలముకొన్నాయి. ఓ నవ వధువు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తూ ఏడ్చింది.
ఎక్కేక్కి పడి ఏడ్చిన ఆ వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఈ విషాద సంఘటన ఒడిశాలోని సోనేపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
సోనేపూర్ జిల్లాకు చెందిన ఓ యువతి.. బాలాంగిర్ జిల్లా యువకుడిని శుక్రవారం పెళ్లాడింది.
ఆ తర్వాత నూతన వధువును ఆమె కుటుంబ సభ్యులు అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక తాను అమ్మను, తోబుట్టువులను వదిలి అత్తారింటికి వెళ్తున్నాన్న బాధలో వెక్కి వెక్కి ఏడ్చింది.
వధువు గుక్కపట్టి ఏడ్వడంతో.. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. వధువును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.