రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు

245
Railway platform ticket price hike

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకొంది.

రూ.10 నుంచి రూ. 30కి పెంచుతున్నట్లుగా భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించడానికి, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఈ రేటు పెంపు నిర్ణయం తాత్కాలికమేనని తెలిపింది. తర్వాత రేట్లను సవరిస్తామని ఈ సందర్భంగా రైల్వే శాఖ వెల్లడించింది.