గోల్డ్ లోన్ కోసం శుభవార్త ..ఎస్‌బీఐ బంపరాఫర్..!

218

గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది.

అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లకే గోల్డ్ లోన్ తీసుకోవచ్చని పేర్కొంది.తక్కువ వడ్డీ రేట్లు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తోంది.

స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్‌పై 7.5 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

సంబాధిత డాక్యుమెంట్లతోనే గోల్డ్ లోన్ పొందొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఇంట్లో బంగారం, నాణేలు వంటివి ఉంటే వీటిని తీసుకెళ్లి బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం పొందాల్సి ఉంటుంది.

బంగారు రుణాలకు సంబంధించి 7208933145 నెంబర్‌కు గోల్డ్ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది.

బ్యాంక్ అధికారులు మీకు రిటర్న్ కాల్ చేస్తారు. గోల్డ్ లోన్ తీసుకునే వారు కనీసం రూ.20 వేలు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.20 లక్షల వరకు తీసుకోవచ్చు.