ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించి, వారితో ఊరు విడిచి వెళ్లిపోయింది. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్ లోచోటుచేసుకుంది. వారి పెళ్లి గ్రామ పెద్దలు నిర్ణయించారు.
వారిని ఊరికి తీసుకువచ్చి వారిలో ఒకరితో ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు.
అందుకోసం ఓ లక్కీ డ్రా కూడా తీశారు.యూపీలోని అజీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏకంగా నలుగురిని ఇష్టపడింది.
వారు కూడా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఇటీవల ఆ అమ్మాయి నలుగురు యువకులతో కలిసి తన బంధువుల ఇంటికి చేరింది.
అయితే ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు.
ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లాడాలని ఆ యువతికి సూచించారు. దాంతో ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోవడంతో లాటరీయే శరణ్యమని భావించారు.
ఆ నలుగురు యువకుల పేర్లు చీటీలపై రాసి ఓ చిన్నారితో లక్కీ డ్రా తీయించారు.
డ్రాలో ఓ యువకుడి పేరు రావడంతో ఆమెను సదరు యువకుడితో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.