
తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది.
కళాశాల మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో అకస్మాత్తుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
వెంటనే అప్రమత్తమైన కళాశాల నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కంప్యూటర్ ల్యాబ్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు ల్యాబ్లో విద్యార్థినీలు లేకపోవడంతో కాలేజీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.