పంక్చర్ వేసి గాలి కొడుతుండగా ట్రాక్టర్ టైరు పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండంలోని కొమనాపల్లి గ్రామంలో గత రాత్రి చోటుచేసుకొంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. దాసరి సూర్యనారాయణ (52) గత 30 సంవత్సరాలుగా కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు.
అలాగే, సైకిల్ రిపేరింగ్, పంక్చర్, వాహనాలకు గాలి కొట్టడం వంటి మెకానికల్ పనులు చేస్తుంటాడు.
గత రాత్రి దుకాణం మూసివేస్తున్న సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) ట్రాక్టర్ టైరు తీసుకొచ్చి పంక్చర్ వేసి గాలి కొట్టమని కోరాడు.
రేపర్ పూర్తయిన అనంతరం సూర్యనారాయణ గాలి కొడుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సూర్యనాయణ, గోవింద ఇద్దరూ పైకెగిరిపడ్డారు.
ఈ ఘటనలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన గోవిందను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.