ఈ నెల 21 వరకు మేడారం ఆలయం మూసివేత

195
Medaram temple close till march 21st

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఫిబ్రవరి 24న సాంప్రదాయబద్దంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

నాలుగు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ మినీ జాతరలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు కలకలం రేపాయి. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆలయ సిబ్బందిలో ఇద్దిరికి కరోనా సోకడంతో 21 రోజులపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి వరకు భక్తులు ఎవరూ వనదేవతల దర్శనానికి రావొద్దని కోరారు.

మినీ జాతరలో  తల్లుల దర్శనానికి నెల రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో ఆలయ సిబ్బందిలో ఇద్దరు రెండు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.

దీంతో భక్తులు, గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మూడు వారాల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు.

అప్పటి వరకు భక్తులు ఎవరూ అమ్మల దర్శనానికి రావొద్దని అభ్యర్థించారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు దర్శనాలను నిలిపివేస్తున్నప్పటికీ ఆలయంలో పూజలు కొనసాగుతాయని వెల్లడించారు.