
చమురు కంపెనీలు మరోసారి గ్యాస్ ధరలను మరోసారి పెంచాయి. దీంతో కర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి.
గత వారంలో సబ్సిడీ గ్యాస్ ధరలను కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే.ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరను పెంచాయి.
ఒక్కో సిలిండర్‌పై రూ.95 వడ్డించాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది.
పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని పెట్రో కంపెనీలు ప్రకటించాయి. ఫిబ్రవరిలో ఏకంగా 16 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
అదేవిధంగా గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మూడుసార్లు పెంచాయి. దీంతో ఒక్క నెలలోనే సిలిండర్ ధర రూ.100 వరకు పెరిగింది.