ఈ రోజు రాశి ఫలితాలు–బుధవారం 10 జులై 2019

293
today horoscope details

మేష రాశి : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారవిషయాల్లోఅనుకూల ఫలితం పొందుతారు.

వృషభ రాశి : ఈ రోజు ఉద్యోగ విషయంలోకానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధలావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. తొందర పడి నిర్ణయాలు తీసుకోవటంకానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథున రాశి : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గు తుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూలదినం కాదు.

కర్కాటక రాశి : మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు లేదా ఛాతి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. గ్యాస్ట్రిక్‌ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత ్తఅవసరం. చదువులోఆటంకాలు ఏర్పడతాయి. భూ, వాహనసంబంధవ్యవహారాలు వాయిదాపడతాయి.

సింహ రాశి : మీమనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటంకానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యంచేయకండి. మీబంధువులలోఒకరి నుంచి అనుకోని సాయాన్నిపొందుతారు. ప్రయాణాల్లోజాగ్రత్త అవసరం.

కన్య రాశి : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరుకానీ, వ్యవహారశైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంది. వివాదాల్లోతల దూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యేఅవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

తుల రాశి : ఈ రోజు మీస్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీజీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థికవిషయాలు పెద్దగా అనుకూలించవు.

వృశ్చిక రాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోనిఖర్చులు కాని ప్రయాణాలుకాని చేయవలసివస్తుంది. మానసికంగాఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లోజాగ్రత్తఅవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులుకానీ పోగొట్టుకోకుండా చూసుకొండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి : ఆర్థికంగాఅనుకూలంగాఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటంకానీ, లేదామిత్రులు, బంధువుల ద్వారాఆర్థిక సహాయం అందటంకానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలోకానీ వ్యాపారంలోకానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

మకర రాశి : ఈ రోజు మీ వ్యాపార లేదాఉద్యోగ సంబంధప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. అలాగే విదేశీయానం గురించికానీ, ఉద్యోగంలోమార్పుగురించి కానీ మీరుచేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధవ్యవహారాలకు, పైఅధికారులను కలవటానికి అనుకూలదినం

కుంభ రాశి : దూరప్రదేశం నుంచివచ్చిన మిత్రులనుకానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పనిఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనంచేసుకుంటారు.

మీన రాశి : మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలోజాగ్రత్త అవసరం. నూతనవ్యాపారానికి, ఆర్థికలావాదేవీలకు అనుకూలదినం కాదు.