ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 16 జులై 2019

259
horoscope-details

మేష రాశి : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబసభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ సంతానంకారణంగా ఆనందాన్ని పొందుతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : ఈ రోజు ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

మిథున రాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీపిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులకోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్యదినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

కర్కాటక రాశి : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించిన కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒకకొలిక్కివస్తాయి. కోర్టుకేసులు, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

సింహ రాశి : ఈ రోజు ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లోజాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూలదినం కాదు.

కన్య రాశి : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒకకొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతచిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

తుల రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.

వృశ్చిక రాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పనిచేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూరప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసేప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులను కాని, స్నేహితులను కాని కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు పూర్తి చేస్తారు.

మకర రాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

కుంభ రాశి : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. మీ జీవితభాగస్వామితో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.

మీన రాశి : మీరు ఏదైనా కొత్తపని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభించే పనుల్లో విజయంసాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్త్రీల విషయంలో కల్పించుకోకండి.