ఈ రోజు రాశి ఫలితాలు–శనివారం 20 జులై 2019

297
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేష రాశి : ఈ రోజు మీబంధువులను లేదా పరిచయస్తులను కలవటానికివెళ్తారు. వివాహం లేదా ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు లేదా వాటికిసంబంధించినచ చర్చల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం కారణంగా ఇతరుల కోపానికి, అసహనానికి కారకులయ్యే అవకాశముంటుంది.

వృషభ రాశి : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరికనెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదాపడుతున్నపనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిథున రాశి : ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.

కర్కాటక రాశి : ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహపూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది గనుక కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.మీ ఉత్సాహాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది.

సింహ రాశి : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, ఆలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. వాయిదాపడుతున్నపనులు పూర్తవుతాయి.

కన్య రాశి : ఈ రోజు చాలాకాలం నుంచి వాయిదాపడుతున్న పనులుచేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగాపూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. అనవసర వివాదాలకు తావివ్వకండి.

తుల రాశి : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగాఉంటుంది.అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

వృశ్చిక రాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఆర్థికవిషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం.

మకర రాశి : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదాపడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే గనుక పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కుంభ రాశి : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

మీన రాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి.