మేష రాశి : ఈరోజు ప్రతిపనిలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసికస్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగాఉంటాయి.
వృషభ రాశి : ఈరోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగేప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.
మిథున రాశి : ఈరోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధలావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.
కర్కాటక రాశి : ఈరోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల కొంత చికాకుకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.
సింహ రాశి : ఈరోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడామీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య రాశి : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచితనిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
తుల రాశి : ఈరోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహారశైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వివాదాల్లో తలదూర్చడం వల్ల మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.
వృశ్చిక రాశి : ఈరోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలోసామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలోఉండాలని, కుటుంబ సభ్యులతోగడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.
ధనుస్సు రాశి : ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగాఒత్తిడికి, ఒంటరి తనానికిలోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.
మకర రాశి : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటంకానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.
కుంభ రాశి : ఈరోజు మీ వ్యాపారం లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలోమార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి : ఈరోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికిసంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పనిఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.