ఈ రోజు రాశి ఫలితాలు–సోమవారం 08 జులై 2019

331
today rashi phalalu

మేష రాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూల దినం.

వృషభ రాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయంఅందుతుంది. ఆర్థికసాయం కోరకు ఎదురు చూస్తున్న వారికి ఈరోజు అనుకూల ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథున రాశి : ఈరోజు మీరు ఇష్టపడిన వారికి మీప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోటానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్న వారికి అనుకున్న సాయం అందుతుంది. మీపిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

కర్కాటక రాశి : ఈరోజు పనిమీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబసభ్యులతో గడపాలి అనే ఆలోచన ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈరోజు తీసుకోవచ్చు. మీతల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహ రాశి : ఈరోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాసం ఉంది. అలాగేవిదేశం నుంచి ఒకముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీభావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్‌ఫర్‌గానీ ఉంటుంది.

కన్య రాశి : ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాలపాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటంకానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

తుల రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండాఉండటం మంచిది. మీజీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం భిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చిక రాశి : ఈరోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్నపనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

ధనుస్సు రాశి : ఈరోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగాఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

మకర రాశి : ఈరోజు మీరు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీపనికి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారుల నుంచి అనుకోని బహుమతి అందుకుంటా రు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభ రాశి : ఈరోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచనతో ఉంటారు. అనుకోని ప్రయాణం, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలోకానీ మార్పు కోరుకుంటారు.

మీన రాశి : ఈరోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానంకానీ, భయంకానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజుకాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీఆందోళనకు కారణం కావొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. మీభావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.