ఈ రోజు రాశి ఫలాలు – 21 గురువారం జూన్ 2018

536
horoscope-details

శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠమాసం, శుక్లపక్షం; తిథి: అష్టమి తె. 3.52 తదుపరి నవమి; నక్షత్రం: ఉత్తర రా. 1.19 తదుపరి హస్త; వర్జ్యం: ఉ. 8.50-10.24; దుర్ముహూర్తం: ఉ. 11.51-12.43; అమృతఘడియలు: సా. 6.15-7.50; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 5.44; సూర్యాస్తమయం: 6.50

మేషరాశి : ఈరోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభరాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది.

మిథునరాశి : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.


కర్కాటకరాశి : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహరాశి : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావచ్చు. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కన్యరాశి : ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు లుకాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.డబ్బు, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసు కోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

తులరాశి : ఈ రోజు బంధువులను లేదా మిత్రులను కలుస్తారు. ముఖ్యంగా మీరు బాగా ఇష్టపడే వ్యక్తులను కలుస్తారు. అనుకోని ఆదాయం కానీ, బహుమతి కానీ అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావటం కాని, అనుకోని ఆదాయం రావటం కానీ జరుగుతుంది.



 

వృశ్చికరాశి : మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు.

ధనుస్సురాశి : ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి అనుకూల మార్పులు ఉంటాయి. మిత్రులతో కలిసి ప్రయాణం, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. విదేశీయానానికి సంబంధించిన పనులు కొలిక్కి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుగా ఉంటుంది. గృహ సంబంధ ఒప్పందాలు చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

మకరరాశి : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

కుంభరాశి : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులను, బంధువులను కలుస్తారు. ఏదైనా శుభకార్యం లో పాల్గొంటారు. భూమి లేదా వాహన సంబంధ ఒప్పందాలు, కొనుగోలు చేస్తారు.వ్యాపారంలో మార్పు కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ చేస్తారు. ఉద్యోగంలో అనుకోని మార్పు ఉంటుంది.


మీనరాశి : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.