
జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలులు గడచిన సంగతి తెలిసిందే.
మరికాసేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనేది స్పష్టత రానుంది.
ఎంతో ఉత్కంఠగా ఎదిరిచూస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఈరోజు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లకు సంబంధించి ఎన్నిక నిర్వహించారు. డిసెంబర్లో ఫలితాలు ప్రకటించారు.
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటివరకు పదవి బాధ్యతలు స్వీకరించలేదు.
గురువారంతో పాత పాలకవర్గం కాలం పూర్తవనుండగా… నూతన పాలకవర్గం కొలువుదీరనుంది.
ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నూతన కార్పొరేటర్లు గురువారం ఉదయం 10:30 లోపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ఈ రెండు పదవులు అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది.
బరిలో మాత్రం టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ, ఎంఐఎం కూడా ఉన్నాయి. అయితే, మేయర్, ఉప మేయర్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని తెలుస్తోంది.
పార్టీ ఎన్నికల పరిశీలకులైన మంత్రులు సీల్డ్ కవర్‌ను తెరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.