
దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది.
ఈ వ్యాక్సిన్ ను తొలుత వైద్య సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు, మున్సిపల్ సిబ్బందికి ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో కరోనా టీకా తీసుకున్న పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు.
అంబేద్కర్ కాలనీకి చెందిన ఆర్ కృష్ణయ్య (49) అనే పారిశుద్ధ్య కార్మికుడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో టీకా తీసుకున్నాడు.
అరగంటపాటు ఎలాంటి సమస్య లేకపోవడంతో టీకాలు వేస్తున్న ఎంపీడీవో కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు.
నిన్న ఉదయం ఇంటి వద్ద కళ్లు తిరిగి కిందపడిపోవడంతో వెంటనే అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.