
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం ఢీకొట్టడంతో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
పెద్దఅంబర్‌పేట్ వద్ద డ్రైవర్ హన్మంతు కారును రోడ్డుకు పక్కన ఆపాడు. అదేసమయంలో ఇనుపలోడుతో వచ్చిన ఓ డీసీఎం కారు వెనుక ఆగింది.
అదే రోడ్డులో మిర్చీలోడ్‌తో మార్టూరు నుంచి పటాన్‌చెరు వెళ్తున్న మరో డీసీఎం ఆగి ఉన్న డీసీఎంను వేగంగా ఢీకొట్టింది.దీంతో అది ముందున్న ఇన్నోవాను బలంగా తాకింది.
దీంతో కారు డ్రైవర్ హన్మంతు అక్కడిక్కడే మృతిచెందాడు. మిర్చీ లోడుతోఉన్న వాహనంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు మృతిచెందాడు.
ఇనుప లోడుతో ఉన్న డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు వాహనాల్లో ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో వారిని బయటకి తీశారు.
గాయపడిన డ్రైవరును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా