పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 57 మంది అరెస్ట్!

160
Police raid poker site 57 arrested

పేకాట స్థావరంపై రామగుండం, మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పేకాట స్థావరాలపై దాడి చేసి 57 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..

ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించరన్నారు.

ఈ దాడిలో ముఠాలోని 57 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6లక్షల నగదుతో పాటు 18 వివిధ రకాల వాహనాలు, 63 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

పేకాట ఆడే వారి విషయంలో ఎంతటి వారినైనా వదిలేది లేదని అన్నారు.

పేకాట ఆడుతున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో అరెస్టైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని సీపీ తెలిపారు.