కాలువలో కారు బోల్తా..ముగ్గురు గల్లంతు!

203
Car overturns in canal

రోడ్డుపై వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో చోటు చేసుకొంది.

ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మృతుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా తెలుస్తోంది.
కాలువలో గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.