తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ఆరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే . తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆమె పార్టీని ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె పార్టీ ప్రకటనపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు విమర్శలు చేశారు, తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు.
సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన హరీశ్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల చేసిన ప్రకటనపై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమే పరోక్ష విమర్శలు చేశారు. .
అలాంటి వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని మంత్రి వివరించారు.