ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని ఆరోగ్యవరం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన
ధనుశ్(16), రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన తరుణ్‌కుమార్ రెడ్డి(16), శ్రీహరి (18) కలిసి ద్విచక్ర వాహనంపై ఓ వివాహ వేడుక కోసం తరిగొండ గ్రామానికి బయలుదేరారు.
రాత్రి కావడంతో వారి వాహనం ఆరోగ్యవరం వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన విద్యార్థులు వేర్వేరు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.