
బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు బ్యాంక్‌లను విలీనం చేయాలని డిసైడ్ అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. మూడు బ్యాంక్‌లను విలీనం చేయడం వల్ల ఇది దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించినట్లు ఆయన తెలిపారు.
బ్యాంక్‌ల విలీనంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కూడా స్పందించారు. బ్యాంక్‌లను స్థిరీకరిస్తామని తాము బడ్జెట్ ఎజెండాలో ఫిక్స్ చేశామని గుర్తు చేశారు. దానికి తగ్గట్టుగానే మొదటి అడుగు వేశామని జైట్లీ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ ఉద్యోగులకు ఎటువంటి సర్వీస్ ఆంక్షలు ఉండవన్నారు. ఉద్యోగులందరికీ ఉత్తమ సర్వీసు నియమావళి వర్తిస్తుందన్నారు.