ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. ఆశావాణి అనే మహిళకు మొదటి కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఒకరు బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.