షుగర్ పేషెంట్లకు ఇవి చాలా మేలు చేస్తాయి!

802
These are very good for diabetes patients!

ఈ మధ్య కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మండి షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.

ప్రపంచంలోని సగం మంది మానసిక ఒత్తిడి, చెడు అలవాట్లు వల్ల టీనేజర్లు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.

షుగర్ బారిన పడినవారు ఆహార నియమాయాలను పాటించి, వ్యాయామం చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే సాల్ట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లు, స్నాక్స్, ఫ్రైలు, చేక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.

చిప్స్, స్నాక్స్ వంటివి కోపోడా ఎక్కువగా తినకూడదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

శీతాకాలంలో కమలాలు, బత్తాయిలు విరివిగా లభిస్తాయి. వీటిలో తీపి, పులుపు రెండు రుచులూ ఉంటాయి.

ఇవి షుగర్ పేషెంట్లకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉన్న పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌‍లో ఉంచుతుంది.

జామకాయలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అనేది మనం తినే ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వదు. అందువల్ల వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు.