హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

293
car crashed into a canal .. Two killed one lost!

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. రాష్ట్రంలోని బీద్‌‌-పర్లీ హైవేపై ఈ ఘటన చోటుచేసుకొంది.

అతివేగంగా వెళ్తున్న ట్రక్కు ఆటో, బైకు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

ఆదివారం రాత్రి ఓ ఆటో మద్వానీ నుంచి బీడ్‌ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మోటార్‌ సైకిల్‌ను మరో ఫోర్‌ వీలర్‌ను ఢీకొట్టింది.

అనంతరం రోడ్డు పక్కను ఉన్న ఓ గుంతలో పడిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చ్కెందారు.

మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.