పెళ్లి పేరుతో వృద్ధుడిని నమ్మించి.. యువతి ఘరానా మోసం

242
old man name of marriage ..woman Cheated crore rupees

పెళ్లి చేసుకుంటానని వృద్ధుడిని నమ్మించి కోటి రూపాయలు కొట్టేసింది ఓ యువతి.

73 ఏళ్ల వయసున్న ఆ వృద్ధుడిని పెళ్లి చేసుకుని అండగా ఉంటానని సదరు మహిళ మాయమాటలు చెప్పి నమ్మించింది.

దీంతో పెళ్లి ఆశతో ఉన్న వృద్దుడు ఏకంగా కోటి రూపాయలు సమర్పించుకున్నాడు.

ఈ ఘటన ముంబై మహానగరంలో జరిగింది. చివరికి మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లను 2019లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు.

వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొన్నాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న షాలినీ అనే మహిళ ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా గమనించింది.

వృద్ధుడు డ్రా చేసిన సొమ్ముపై కన్నేసిన నిందితురాలు పథకం రచించింది. బ్యాంకుకు వచ్చే అతడితో నెమ్మదిగా పరిచయం పెంచుకుంది. ఆపై మరింత ముందుకెళ్లి పెళ్లి చేసుకుని అండగా ఉంటానని నమ్మించింది.

ఆమె మాటలకు లొంగిపోయిన వృద్ధుడు షాలినితో కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగాడు. జెరాన్ తన ట్రాప్‌లో పడ్డాడని నమ్మిన షాలిని తన ప్లాన్ అమలు చేసింది.

తానో వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టబడి పెడితే వచ్చే లాభాల్లో చెరిసగం తీసుకుందామని చెప్పింది.

కాబోయే భార్యే అనుకోని జెరాన్ రూ. 1.3 కోట్లను గతేడాది డిసెంబరులో ఆమె ఖాతాలో జమచేశాడు.

డబ్బు తన ఖాతాలోకి జామకాగానే షాలిని తన ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. బాధిత వృద్ధుడు ఆమెను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

దీంతో మోసపోయానని తెలుసుకున్న జెరాన్ గత డిసెంబరులోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ యువతిపై తాజాగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.