
తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న విధానాల్ని నిరసిస్తూ ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంటి వద్ద దీక్షలు చేయటం జరిగింది.
ఈ సందర్బంగా మాజీ SC మోర్చ రాష్ట్ర కార్యదర్శి, డి అర్ యు సి సీ మెంబర్ క్యాతం వెంకటరమణ గోదావరిఖని లో మాట్లాడుతూ వారం రోజులలో మృగశిర కార్తె ప్రారంభం కానుండగా ఇంత వరకు కనీసం 40% ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం విచారకరం అని అన్నారు.
తూకంలో మోసానికి పాల్పడతూ బస్తకు 5kgల వరకు తరుగు తీస్తు రైతును అటు మిల్లర్లు, ఇటు మార్క్ ఫెడ్ అదికారులు నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు.
రంగుమారిన ధాన్యం, తాలు, తేమ శాతం, ఎక్కువగా ఉందంటూ అనేక రకాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా కొన్న వడ్లకు సకాలంలో డబ్బులు కూడా అందించటం లేదని పై విషయాల లో రైతుల కు ఇబ్బందులు కలగ కుండా చూడగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వర్షాలు ప్రారంబం కానున్నందున రైతులందరికి వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందించాలని లేనిచో తడిసిన ధాన్యం కొనుటకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ అదికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేశారు.