స్థానిక ఆర్.జి-3 ఏరియా ఓ.సి.పి-1 ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజవరపు శ్రీనివాస్ గోదావరిఖని లోని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధాశ్రమానికి ఆదివారం 40 వేల రూపాయల విలువైన ఏ.సి ని అందచేసి తన ఉదారతను చాటుకున్నారు.
తన తల్లి రాజవరపు శేషు పుట్టినరోజును పురస్కరించుకుని,ఆమె ఆశయాల మేరకు తన ఆత్మీయ మిత్రుడు, కళాకారుడు ఓ.సి.పి-1 ఉద్యోగి పోతుల చంద్రపాల్ ద్వారా 40 వేల రూపాయల విలువైన లాయిడ్ కంపెనీకి చెందిన ఏ.సి ని ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబుకు అందజేసారు.
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఎండాకాలంలో ఇద్దరు లేక ముగ్గురు వృద్దులు ఎండవేడికి తట్టుకోలేక చనిపోయేవారని,కానీ ఈ సంవత్సరం శ్రీనివాస్ ఉదారత వల్ల అట్లాంటి సంఘటనలు జరుగవని నమ్ముతున్నానని,
ఇలాంటి దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావడం సంతోషదాయకమని,వితరణ చేసిన శ్రీనివాస్ కు, సహకరించిన చంద్రపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.