కూకట్ పల్లి లో బీజేపీ ” సేవా హి సంఘటన్ ” కార్యక్రమం

754
BJP Seva hi Sanghatan in Kukatpalli

సేవా హి సంఘటన్ లో భాగంగా మేడ్చల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు గారి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తమ నివాసం వద్ద పేద ప్రజలకు మరియు మునిసిపల్ సిబ్బందికి, వాచ్ మాన్ లకు కోడి గుడ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతూ మన దేశ చరిత్రలో మచ్చ లేని నాయకత్వంతో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ” సేవా హి సంఘటన్ ” కార్యక్రమాన్ని నిర్వహించామని , సుస్థిరత కు మారుపేరు మోడీ అని, కరోనా విలయతాండవం చేస్తున్న వేళా కేంద్రం ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ” సేవా హి సంఘటన్ ” కార్యక్రమంలో నిరుపేదలకు , మునిసిపల్ సిబ్బంది కి బలవర్ధక ఆహారం కోసం కోడి గుడ్లు, పండ్లు అందజేశామన్నారు.

Medchal BJP

ఈ కార్యక్రమంలో BJYM జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి, 124 డివిజన్ అద్యక్షులు కమలాకర్ రెడ్డి, OBC మోర్చా జిల్లా నాయకులు దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మని భూషణ్, సెక్రెటరీ రాము, సీనియర్ నాయకులు శంకర్, BJYM నాయకులు శ్రీనాథ్, BJYM ప్రెసిడెంట్ రాహుల్, లక్ష్మి నారాయణ, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.