కరుణానిధితో సమావేశమైన సీఎం కేసీఆర్

256
telangana-chief-minister-meets-dmk-s-m-karunanidhi

దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న సీఎం.. దేశహితం కోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, డీఎంకే శ్రేణులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ తో సమావేశం కానున్నారు.