పవన్‌కల్యాణ్‌ పై కేసు నమోదు

263
Case filed against Pawan Kalyan

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 469, 504, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. టీవీ 9పై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంటూ జర్నలిస్టు సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో నటి శ్రీరెడ్డి.. పవన్‌కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసినసంగతి తెలిసిందే. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించి టీవీ9 ప్రసారం చేసినప్పటికీ.. పవన్‌ కల్యాణ్‌, ఆయన అభిమానులు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి అసత్య ప్రచారం చేశారని జర్నలిస్టు సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఈ చర్య చానల్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని వెల్లడించాయి. ఆ చానల్‌ యజమానిని, సీఈవోను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్‌లో వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపాయి. ఈమేరకు కొన్ని ఆధారాలను కూడా జర్నలిస్టు సంఘాలు పోలీసులకు అందజేశాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఎలకా్ట్రనిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కాడంతో కేసు నమోదు చేశారు.