వైసీపీ వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు: చంద్రబాబు

111
Sharmila is fighting with Jagan:Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్ల గురించి ఆ పార్టీ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదని ఆన్నరు. తప్పుడు కేసులు బనాయించి బెదిరించాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం అయ్యాక నిందితుల కొమ్ము కాయడం జగన్ నైజమని విమర్శించారు. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ అడిగిన జగన్.. సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.