మేష రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరుగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.
మిథున రాశి : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలువడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు/బంధువుల సహాయం అందుకుంటారు.
కర్కాటక రాశి : ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
సింహ రాశి : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివున్ని పూజించండి.
కన్య రాశి : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం విషయంలో గానీ, విద్యా విషయంలో గానీ కొంత ఆందోళన చెందుతారు.
తుల రాశి : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.
వృశ్చిక రాశి : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
ధనుస్సు రాశి : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, చిరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది.
మకర రాశి : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. మీరిచ్చే సలహాలు ఎదుటివారికి లాభిస్తాయి.
కుంభ రాశి : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలైనప్పటికీ అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.
మీన రాశి : ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగం విషయంలో అనుకూల మార్పులు కానీ, వివాదాల్లో విజయం సాధించటం కానీ జరుగుతుంది. మంచి రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు. దుస్తులు లేదా పరిమళ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు.