విద్యార్థినులు చదువుపై దృష్టిపెట్టాలి: మంత్రి సత్యవతి రాథోడ్‌

202

విద్యార్థినులు చదువుపై దృష్టిపెట్టాలని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం కల్వకుర్తి గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఎంపీ రాములు నాయక్‌, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో కలిసి మంత్రి భోజనం చేశారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గురుకులాల పాఠశాల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని అన్నారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.

నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం అందేలా చూస్తున్నారని చెప్పారు. మరిన్ని పాఠశాలలు తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని అన్నారు.