అమ్మాయిని దుస్తులు విప్పమన్నాడు..తర్వాత

172
boy-films-schoolgirl-obscene-video-and-blackmails-her

సోషల్ మీడియా ద్వారా ఎంతటి దుష్పరిణామాలు జరుగుతాయో ఈ సంఘటన తెలియజేస్తుంది. అయినా తల్లిదండ్రులు జాగ్రత్తపడక పోవడం వల్ల వారి పిల్లల జీవితాలు సర్వ నాశనం అవుతాయి. ఇటువంటి ఘటనలు చదువుకున్న వారి ఇళ్లలోనే జరుగుతున్నాయి.

తాజాగా మహారాష్ట్రలోని ముంబై లో ఒక టీనేజ్ బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన్ వ్యక్తితో “ట్రూత్ ఆర్ డేర్ గేమ్” అనే ఆట ఆడింది. అయితే అవతలి వ్యక్తి డేర్ టాస్క్‌లో భాగంగా తన ఒంటిపై దుస్తులను విప్పేయమన్నాడు. తానూ ఓడిపోకూడదు అనే ధ్యాసలో ఆమె బట్టలు విప్పేసింది.

కానీ ఆ వ్యక్తి దానిని షూట్ చేసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ఆరంభించాడు. బాధిత యువతి వయసు 14 ఏళ్లు, నిందితుడు వయసు 13 ఏళ్లు. ఇద్దరు మైనర్లే. అయితే అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసిన బాలుడు ఆమె చదివే స్కూల్‌లోనే చదువుతున్నట్టుగా తర్వాత తెలిసి అందరు షాక్ తిన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత యువతి లాక్‌డౌన్ సమయంలో తనకు సోషల్ మీడియా‌లో తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫాలో రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. అయితే కొద్ది రోజుల పాటు నమ్మకంగా చాటింగ్‌ చేసి ఆమెను నమ్మించాడు. కానీ చాట్ చేస్తున్న వ్యక్తి తన స్కూల్‌మేట్ అనే విషయం ఆ యువతికి తెలియదు.

ఆ బాలుడు ఆమెని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడేందుకు ఒప్పించాడు. ఈ గేమ్ పాల్గొనే వ్యక్తులు గేమ్ లో భాగంగా నిజం చెప్పడమో, డేర్ చేయడమే చేయాలి. ఇదే అదనుగా తీసుకున్న ఆ అబ్బాయి యువతితో గేమ్ స్టార్ట్ చేసాక డేర్‌లో భాగంగా అమ్మాయి ఒంటిపై బట్టలు తీయాలని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఒంటిపై బట్టలు విప్పేసింది. అయితే యువతి బట్టలు విప్పిన దృశ్యాలను ఆ బాలుడు ఆమెకు తెలియకుండా రికార్డు చేశాడు.

ఆ తర్వాత ఆ వీడియోను ఆ అమ్మాయికి పంపించి బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని, నేను చెప్పినట్టు వినాలని, లేదంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఇలా కొంతకాలం వీడియో కాల్ చేసి అమ్మాయిని బట్టలు విప్పాల్సిందిగా కోరేవాడు.

ఇక నిందితుడి వేధింపులు భరించలేక అతడిని బ్లాక్ చేసింది. దీంతో ఆ బాలుడు తన ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియోను ఆమె స్నేహితులలో ఒకరికి పంపాడు. ఈ విషయాన్ని ఆ బాలుడు ఆమె దృష్టికి తీసుకువచ్చాడు.

వెంటనే అలర్ట్ అయిన ఆమె తల్లిదండ్రులు అమ్మాయి ద్వారా పొలిసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ ని ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించారు. అయితే నిందితుడు యువతి చదివే స్కూల్‌లోనే చదువుతున్న బాలుడని తెలియడంతో అంతా షాక్ అయ్యారు.

అయితే బాలుడు కుటుంబం చాలా మంచిదని, అతని తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులని ఓ పోలీసుల అధికారి తెలిపారు. బాలుడి చర్యతో అతని తల్లిదండ్రులు షాక్ తిన్నారని, అతడు ఫోన్‌లో ఏం చేస్తున్నాడనే దానిపై వారికి అవగాహన లేదని చెప్పారు.

అయితే బాలుడు వయసు దృష్ట్యా అతనికి నోటిసు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు పిల్లల కోర్టులో హాజరు కావాల్సిందిగా బాలుడిని ఆదేశించారు.