టీఆర్ఎస్‌కు షాక్.. సోమారపు గుడ్‌ బై

267
goodby to TRS party

టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. తెరాస సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి రాజీనామా లేఖలు సమర్పించారు.

రామగుండం నియోజవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో సత్యనారాయణ పరాజయం చవిచూశారు.అప్పటినుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను అడగకుండానే సీఎం గతంలో నాకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. కానీ, ప్రస్తుతం తెరాసలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. అరాచకం పెరిగిపోయిందని , కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు.

గత ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి మాజీ ఎంపీ బాల్క సుమనే కారణమని వ్యాఖ్యానించారు.