కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది జోధ్‌పూర్ కోర్టు. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను విధించింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్ ఖాన్‌ను తరలిస్తున్నారు. వాస్తవానికి సల్మాన్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షే విధించాలని సల్మాన్ లాయర్లు కోర్టును కోరినా.. కోర్టు మాత్రం ఐదేళ్ల శిక్షను విధించింది. ఇక, ఈ తీర్పును హై కోర్టులో సవాల్ చేయనున్నారు సల్మాన్ తరఫు న్యాయవాదులు. బెయిల్ కోసం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.