జియో IPL బంపరాఫర్స్ – పండగ చేసుకోండి

369
jio ipl bumper offer

మొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన జియో..ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. క్రికెట్ అభిమానులు IPL కోసం రెడీ అవుతుండగా.. మరోసారి ఆసక్తికరమైన వినోదాన్ని తన కస్టమర్లకు పంచేందుకు ముందుకు వచ్చింది జియో. క్రికెట్, కామెడీ రెండు వినోద కార్యక్రమాలను విడుదల చేసింది. జియో ధన్ ధనా ధన్ లైవ్.. జియో క్రికెట్ ప్లే అలాంగ్ అనే కొత్త స్కీంను లాంచ్‌ చేసింది. దీంతోపాటు జియో క్రికెట్ సీజన్ ప్యాక్ అనే కొత్త రీచార్జ్‌ ఆఫర్ ను కూడా అందుబాటులోకి తెస్తోంది.

జియో క్రికెట్ ప్లే అలాంగ్

జియో క్రికెట్ ప్లే అలాంగ్ పేరుతో ఆవిష్కరించిన లైవ్ మొబైల్ గేమ్ షో ద్వారా వినియోగదార్లు క్రికెట్‌ను ఆస్వాదించడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ మొబైల్ గేమ్ షోలో 25 కార్లను గెల్చుకునే అవకాశం. 7 వారాలు, 60 మ్యాచ్‌ల వరకు ఈ గేమ్ షో వినోదాన్ని పొందవచ్చు.



జియో ధన్ ధనా ధన్ లైవ్

ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు క్రికెట్ తో పాటు స్వేచ్ఛమైన వినోదాన్ని అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఈ షో ఏప్రిల్ 7న మై జియో యాప్ లో అందుబాటులోకి వస్తుంది. జియో కస్టమర్లతో పాటు జియో యేతర కస్టమర్లూ ఈ షోను ఫ్రీగా వీక్షించవచ్చు. దేశ ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్, ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కొచ్చర్ కామెడీ షో ను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇంకా శిల్పా షిండే, అలీ అస్గర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గణత్ర, శివాని దండేకర్ , అర్చన విజయ్ కూడా ఈ షోలో పాల్గొంటారు. అంతేకాదు క్రికెట్‌ లెజెండ్స్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను చూసే అవకాశం.

జియో క్రికెట్ సీజన్ ప్యాక్

IPL దృష్టిలో ఉంచుకుని కొత్త రీఛార్జి ప్యాక్ ను తీసుకొచ్చింది. జియో క్రికెట్ సీజన్ ప్యాక్ పేరుతో అందించనున్న ఈ ప్యాక్ ద్వారా రూ. 251 చెల్లిస్తే.. 51 రోజులకు 102GB 4G డేటా వస్తోంది. ఈ కొత్త రీఛార్జి ప్యాక్ ద్వారా ప్రేక్షకులు తమకిష్టమైన IPL మ్యాచ్ లను జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు.