
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతోనే ఎక్కవగా ట్రాఫిక్ జాంలు అవుతుండడంతో దీనిపై రవాణా శాఖ సీరియస్ గా దృష్టి సారించింది. ప్రైవేట్ బస్సులు నగరం లోపలికి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రేపటి నుంచి కేవలం ఔటర్ రింగ్ రోడ్ నుంచి మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జంట నగరాల్లోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ట్రావెల్స్ యజామాన్యాలకు సమాచారం అందించామని అధికారులు చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కొంత ఇబ్బంది కలిగినా నగరంలో నరకయాతన కు చెక్ పడనుందన్నారు.