సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. మనందరం సమైక్యంగా ఉండాలని సచిన్ అన్నాడు.దేశం గురించి భారతీయులకు తెలుసు.. మన దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని సచిన్ తెలిపాడు.
దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకూడదని చెప్పాడు. బయటి శక్తులు ప్రేక్షకులు మాదిరిగానే ఉండాలని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని అన్నాడు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్ రైతులకు అనుకూలంగా స్పందించడంతో అంతర్జాతీయంగా ఇది చర్చనీయాంశంగా మారింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సైతం రైతులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇక పాప్ సింగర్ రిహానాకు ట్విట్టర్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.