ప్రాణభయం ఉంది..భద్రత కల్పించండి: రేవంత్ రెడ్డి

128
TRS dramas played farming laws:Revanth

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి తనకు ప్రాణభయం ఉందని లేఖలో పేర్కొన్నారు. తన కదలికలపై పోలీసుల నిఘా వుందని తెలిపారు. తక్షణమే తనకు కేంద్ర బలగాలతో ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంతో కూడిన భద్రత కల్పించాలని లేఖలో కోరారు. తన భద్రత విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాననని తెలీపారు. కోర్టు కూడా భద్రత కల్పించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశానుసారం తనకు భద్రత కల్పించాలని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని రేవంత్ రెడ్డి వివరించారు. అధికార పార్టీ అవినీతి, అక్రమాలపై తాను పోరాటం చేస్తున్నట్లు వివరించారు. 2018లో తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా పోలీసుల వైఖరిని న్యాయస్థానం తప్పు పట్టినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ అంశంలో వికారాబాద్ ఎస్పీని బదిలీ చేశారని లేఖలో ప్రస్తావించారు.