రేవంత్ రెడ్డి మాస్ లీడర్: కొండా సురేఖ

262
Rewanth Reddy Mass Leader Konda Surekha

 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే సరైనోడని మాజీ మంత్రి కొండా సురేఖ అభివర్ణించారు.

ఉత్తమ్ కుమార్ క్లాస్ లీడర్ అయితే రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అని కొండా సురేఖ కితాబిచ్చారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది.ఈ సభకు హాజరైన మహిళా నేత కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అడ్డుతగిలినవాళ్లే ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.

గతంలో రైతు సమస్యలపై వైఎస్సార్ పాదయాత్రకు కూడా అనుమతి లేదన్నారని ఆమె గుర్తు చేశారు.

ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చూశారని అన్నారు. ఆ పెద్దమనుషులే ఈరోజు కూడా మాట్లాడుతున్నారని సురేఖ విమర్శించారు.

నాడు వైఎస్ ను ఆపాలని వారు భావించినప్పుడు వైఎస్ భయపడలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ కోసం ఆయన నడిచారని చెప్పారు.

టీడీపీని గద్దె దించి రైతాంగాన్ని ఆదుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు.