మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి!

178
Pawan Kalyan Municipal Elections

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేసింది.

గతంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించే విధానగా నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూలుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఎన్నికల నోటిఫికేషన్ పై ఎస్ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు. గతేడాది చేపట్టిన పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార పక్షం దౌర్జన్యాలతో చాలామంది పోటీకి దూరమయ్యారని తెలిపారు.

గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం చెప్పడం అసంతృప్తి కలిగించిందని తెలిపారు.