రిలయన్స్ జియో వర్చువల్ కరెన్సీ జియోకాయిన్‌

257
reliance-jio-plans-launch-cryptocurrency-jiocoin

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా బిట్‌కాయిన్ వంటి ఊహాజనితమైన విర్చువల్ కరెన్సీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండడం తెలిసిందే. వీటిల్లో పెట్టుబడులకు మదుపర్లు ఆసక్తి చూపిస్తుండడంతో ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌ కూడా ఈ వ్యాపారంపై కన్నేసింది. బిట్‌కాయిన్‌ వంటి క్రిపోకరెన్సీలకు పోటీగా తన సొంత క్రిప్టోకరెన్సీ-జియోకాయిన్‌ను తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జియోకాయిన్ ప్రాజెక్టుకు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు అకాష్ అంబానీ సారథ్యంవహించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ ప్రాజాక్టుకు సంబంధించి 50 మంది యువ నిపుణులను(25 ఏళ్ల వయస్కులు) రిలయన్స్ జియో ఎంపిక చేయనుంది. క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను ఈ నిపుణుల బృందం పరిశీలిస్తుంది.

అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబుడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని మదుపర్లను హెచ్చరించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని స్పష్టంచేశారు.

రిలయన్స్ జియో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)లో కూడా అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.