ఎయిర్ ఏసియా ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.99 బేస్ ఛార్జీతో విమాన టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, న్యూఢిల్లీ, పూణె, రాంచీ నగరాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. జనవరి 15 నుంచి 21వ తేదీలోగా ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోని… జులై 31 వరకు ఏదైనా తేదీల్లో జర్నీ చేయవచ్చు.
అంతేకాదు విదేశాలకు వెళ్లే వారికి కూడా… మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌ఏషియా 10 ఆసియా-పసిఫిక్ రీజియన్(PAAC) దేశాలకు వెళ్లే ప్రయాణికులు కేవలం రూ.1,499 బేస్‌ఛార్జితో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. సింగపూర్, బాలీ, కౌలాలంపూర్, ఆక్లాండ్, బ్యాంకాంక్, మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు ఈ ఆఫర్ వర్తిస్తుంది.