తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ అదనపు కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు
వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు.దీంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 23 వరకు చివరి తేదీగా ప్రకటించారు. ఆ తర్వాత రోజే నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు.
మార్చి 14న పోలింగ్ ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడుతారు.
ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్-ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థిగా చిన్నారెడ్డి పేర్లను ఖరారు చేసింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేయనున్నారు.
ఇదే స్థానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదంరాం పోటీ చేస్తున్నారు. మిగతా పార్టీలూ తమ అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి.