కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఈ రోజు అసోంలో పర్యటించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిశ్వనాథ్ లోని సధారు టీ ఎస్టేట్ లోని తేయాకు తోటలకు వెళ్లారు.
తేయాకు తోటల్లో పనిచేసే కూలీల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తేయాకును సేకరించే కూలీలతో మాట్లాడారు. వారితో కలిసి తేయాకును కోశారు.
కాసేపు వారితో కూర్చుని సరదాగా మాట్లాడారు. వారి ఆచార వ్యవహారాలు, సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఆ విశేషాలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
తేయాకు కూలీలు అందించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువబోనన్నారు. తేయాకు తోటల్లోని కూలీల పనిలో నిజాయతీ, నిరాడంబరత వున్నాయి.
వారి పని దేశానికి ఎంతో విలువైనది. అలాంటి విలువైన వారితో ఈరోజు నేను మమేకమయ్యాను.
కూలీల పనితో పాటు వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నానని ట్వీట్ చేశారు.